ఆపన్నహస్తం అందించరూ! | - | Sakshi
Sakshi News home page

ఆపన్నహస్తం అందించరూ!

Sep 18 2026 1:51 AM | Updated on Sep 18 2026 1:51 AM

వర్ధన్నపేట: పేద దళిత కుటుంబంలో జన్మించిన ఆ యువతి ఎలాంటి కోచింగ్‌ లేకుండా కష్ట పడి చదివి మెడిసిన్‌లో సీటు సాధించింది. అయితే ఫీజు చెల్లించలేని దుస్థితిలో ఉంది. ఫలితంగా సీటు క్యాన్సిల్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. వర్ధన్నపేటకు చెందిన కొండేటి భాస్కర్‌, అనిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంతానం. ఇందులో రెండో కూతురు అఖిలకు పటాన్‌ చెరులోని మహేశ్వరి మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చింది. అయితే రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబానికి మెడిసిన్‌లో సీటు వచ్చిందని సంతోషించాలో లేక ఫీజు చెల్లించలేక బాధపడాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మెడిసిన్‌లో జాయిన్‌ కావడానికి రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంది. గడువు రేపు(19న) సాయంత్రం వరకు ఉంది. ఆ లోగా ఫీజు చెల్లిస్తేనే మెడిసిన్‌లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందని అఖిల తండ్రి భాస్కర్‌ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో అఖిల ఫీజు చెల్లించడానికి దాతలు ముందుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.

దాతలు 7207845872 నంబర్‌కు ఫోన్‌ పే లేదా ఎస్‌బీఐ వర్ధన్నపేట, అకౌంట్‌

నంబర్‌ 41698789301 (కొండేటి అక్షర)కు ఆర్థిక సాయం అందించాలని

ఆ కుటుంబం వేడుకుంటుంది.

పేదింటి విద్యాకుసుమానికి

ఆర్థిక ఇబ్బంది

మెడిసిన్‌లో సీటు సాధించినా

ఫీజు చెల్లించలేని దుస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement