సైబర్‌ మోసాలపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలపై అప్రమత్తత అవసరం

Sep 17 2026 1:26 AM | Updated on Sep 17 2026 1:26 AM

మహబూబాబాద్‌ రూరల్‌: సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరీష్‌ అన్నారు. గణే్‌శ్‌ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబాబాద్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన సైబర్‌ సేఫ్‌ గణేశ్‌(వినూత్న థీమ్‌) విగ్రహాన్ని ఎస్పీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్‌ నేరగాళ్లు వివిధ రకాల మోసాల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, బ్యాంకు అధికారులు, పోలీసులు, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్‌ చేస్తే ఓటీపీ, పిన్‌, సీవీవీ, పాస్‌వర్డ్‌ వంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని సూచించారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయకుండా, తెలియని వ్యక్తులకు యూపీఐ ద్వారా డబ్బులు పంపకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌, ఫేక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫర్లు, రివార్డులు, లోన్‌ యాప్‌లు, కేవైసీ పేరుతో వచ్చే లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ లైన్‌కు ఫోన్‌ చేయాలని, అలాగే నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనతరం సైబర్‌ నేరాలపై అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టౌన్‌ ఇన్‌చార్జ్‌ సీఐ అంజలి, ఎస్సై ఉమ, గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సైబర్‌ సేఫ్‌ గణేశ్‌ విగ్రహాన్ని సందర్శించిన ఎస్పీ శబరీష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement