రాజకీయ నాయకులు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

రాజకీయ నాయకులు సహకరించాలి

Sep 17 2026 1:26 AM | Updated on Sep 17 2026 1:26 AM

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్ని విధాలా సహకరించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 88,800 మందికి ఎస్‌ఐఆర్‌ నోటీసులు అందించినట్లు తెలిపారు. నోటీసులు స్వీకరించిన వారు గుర్తింపు కార్డుల జిరాక్స్‌లతో సంబంధిత పోలింగ్‌ కేంద్రాల వద్ద బూత్‌ లెవల్‌ అధికారులను సంప్రదించాలన్నారు. ఓటు భద్రతపై విస్తృత ప్రచారం చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరి ఓటును తొలగించడం జరగదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, నాయకులు సురేష్‌నాయుడు, మార్నేని వెంకన్న, విజయసారథిరెడ్డి, శ్యాంసుందర్‌శర్మ, రామారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పకడ్బందీగా నిమజ్జన ఏర్పాట్లు

మరిపెడ: పకడ్బందీగా గణపతి నిమజ్జన ఏర్పాట్లు చేపట్టాలని మరిపెడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడి ఆదేశించారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని మాకుల పెద్ద చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పట్టణంలోని 2వ వార్డు పరిధి చోక్లాతండాలో చేపట్టాల్సిన పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను తండావాసులతో కలిసి ఆమె పరిశీలించారు. కమిషనర్‌ నరేష్‌రెడ్డి,ఉపేందర్‌, బాదావత్‌ రవి, వెంకట్‌లాల్‌, మణి, నాయకులు శతృనాయక్‌, నరేష్‌, వీరన్న, కస్నా నాయక్‌, సుమన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement