వినూత్న పరిశోధనకు పేటెంట్‌ | - | Sakshi
Sakshi News home page

వినూత్న పరిశోధనకు పేటెంట్‌

Sep 17 2026 1:26 AM | Updated on Sep 17 2026 1:26 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ జూవాలజీ ప్రొఫెసర్‌ జి.షమిత, జువాలజీ విభాగం పూర్వ పరిశోధకురాలు మౌనిక, హైదరాబాద్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాలలోని మైక్రోబయాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గాయత్రి సంయుక్తంగా చేపట్టిన వినూత్న పరిశోధనకు పేటెంట్‌ లభించింది. సింథసిస్‌ ఆఫ్‌ యాంటీమైక్రోబియల్‌ సిల్వర్‌ నానోపార్టికల్స్‌ ఫ్రమ్‌ గట్‌ బాక్టీరియా ఆఫ్‌ టస్సర్‌ సిల్క్‌వార్మ్‌ అనే ఆవిష్కరణకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్‌ లభించిందని షమిత తెలిపారు. ఈ ఆవిష్కరణ ద్వారా టస్సర్‌ సిల్క్‌ వార్మ్‌కు సంభవించే వ్యాధులను నియంత్రించడంతోపాటు పట్టు ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీలో షమిత, పూర్వపరిశోధకురాలు మౌనికను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం, ఓఎస్‌డీ బి.వెంకట్రాంరెడ్డి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement