అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో తెలంగాణ కోచ్‌గా రవీందర్‌ | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో తెలంగాణ కోచ్‌గా రవీందర్‌

Sep 17 2026 1:26 AM | Updated on Sep 17 2026 1:26 AM

జనగామ రూరల్‌ : సెప్టెంబర్‌ 16 నుంచి 18వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి 37వ సౌత్‌ జోన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌న్‌షిప్‌–2026 పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు జనగామకు చెందిన బానోత్‌ రవీందర్‌ టీమ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యువ అథ్లెట్లకు మెరుగైన శిక్షణ, పోటీ వ్యూహాలు, మానసిక ధైర్యం అందిస్తూ వారి అత్యుత్తమ ప్రదర్శనకు కోచ్‌ రవీందర్‌ మార్గనిర్దేశం చేయనున్నారు.

‘మక్క’కు మంచి ధర..

క్వింటాల్‌ రూ.2,775

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మొక్కజొన్న పంటకు మంచి (అధిక) ధర పలికింది. క్వింటాల్‌కు రూ.2,775 పలికింది. దీంతో రైతు ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. వర్ధన్నపేటకు చెందిన సామల ఈశ్వర్‌ మార్కెట్‌కు తన మొక్కజొన్న పంట తీసుకొచ్చాడు. అడ్తిదారు.. సదరు రైతు మక్కలను మార్కెట్‌లో ఉంచగా ఖరీదుదారుడు క్వింటాల్‌కు రూ.2,775 ధరతో కొనుగోలు చేశాడు. దీంతో మంచి లాభం పొందానని రైతు ఆనందం వ్యక్తం చేశాడు.

ఇద్దరిపై పోక్సో కేసు నమోదు

బయ్యారం: మహబూబాబాద్‌ జిల్లా బయ్యా రం మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు బాలికలు గర్భం దాల్చారు. దీనికి కారణమైన ఇద్దరిపై పోలీసులు బుధవారం పోక్సో కేసులు నమోదు చేశారు. ఎస్సై ప్రశాంత్‌బాబు కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన బాలికతో వివాహం జరపగా ఆమె గర్భం దాల్చింది. అదేవిధంగా మండలంలోని మరో గ్రామానికి చెందిన ఇరువురు మైనర్లు కొంతకాలంగా సహజీవనం గడుపుతుండగా బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనలపై ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ఫిర్యాదు ఆధారంగా ఓ యువకుడు, బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మేడిగడ్డకు

కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

కాళేశ్వరం : మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో కలిసి పుష్కరఘాట్‌ను తాకుతూ ప్రవహించింది. దీంతో కాళేశ్వరం వద్ద 6.450 మీటర్ల మేర ప్రవాహం దిగువకు చేరుతోంది. బ్యారేజీ వద్ద 1,08,500 క్యూసెక్కులు తరలిరాగా, బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని అదేస్థాయిలో నీటిని దిగువకు తరలిస్తున్నారు. కాగా, మంగళవారం 94,640 క్యూసెక్కులు ప్రవా హం తరలొచ్చి దిగువకు తరలిపోయింది.

సీనియర్‌ అసిస్టెంట్‌

ఆసిఫ్‌ సస్పెన్షన్‌

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ను ఇటీవల సస్పెండ్‌ చేసినట్లు రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఓ విభాగానికి చెందిన విద్యార్థిని పట్ల అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణల ఫిర్యాదుతో కేయూలోని యాంటీ సెక్సువల్‌ హారాస్‌మెంట్‌ కమిటీతో విచారణ జరిపించామని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా మహ్మద్‌ ఆసిఫ్‌ను సస్పెండ్‌ చేసినట్లు రిజిస్ట్రార్‌ రామచంద్రం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement