మహబూబాబాద్ అర్బన్ : రాష్ట్రంలో ప్రభుత్వ విద్య ను బలోపేతం చేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. యాత్రలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు జెడ్పీహెచ్‌ఎస్‌ను పలువురు విద్యవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆకునూరి ము రళి మాట్లాడుతూ ఈ యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడులు స్థితి, పరిసరాలు, స్థలా లను పరిశీలిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మానుకోటలోని కంకరబోర్డు పాఠశాలను సందర్శించామన్నారు. ఈ పాఠశాలలో సరైన మౌలిక వసతులు, తరగతుల గదులు, మరుగుదొడ్లు, కిచెన్‌షెడ్ లేదన్నారు. అంతేకాకుండా ప్రహరీ లేకపోవడంతో పాఠశాల స్థలం ఆక్రమణకు గురవుతోందన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఇప్పటికై నా ప్రభుత్వ బడుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు చట్టాలు తీసుకురావా లని ఒత్తిడి చేయడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రొఫెసర్ పద్మజ షా, రిటైర్డ్ ఐఏఎస్‌లు ఎంవీ రెడ్డి, ఎం. చంపాలాల్, ప్రధాన వక్తలు ఎన్. రుమీనా, తమ్మినేని నిర్మల, సృజన యాదవ్, ము ప్పూరి కుమారన్న, నిఖిల్, విజయకృష్ణ, పాలకూరి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి


