● డీఏఓ విజయచంద్ర
చిన్నగూడూరు: రైతులు సేంద్రియ వ్యవసాయంౖ వైపు మొగ్గు చూపాలని డీఏఓ విజయచంద్ర అన్నారు. మంగళవారం మండలంలోని జయ్యారం రైతువేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో డీఏఓ పాల్గొన్నారు. గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన రైతులకు సేంద్రియ వ్యవసాయ కిట్స్ అందజేశారు. డీఏఓ మాట్లాడుతూ... రైతులు జీవామృతం, గణామృతం వంటి సేంద్రియ ఎరువులు వాడితే అధిక దిగుబడులతో లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఏఓ భాస్కర్, ఏఈఓ కీర్తి శిరీష, సర్పంచ్‌లు కమలాకర్, సైదులు, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పారదర్శకంగా నిర్వహించాలి..
డిజిటల్ క్రాప్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని డీఏఓ విజయచంద్ర అన్నారు. మంగళవారం మండల కేంద్రం శివారులో వలంటీర్లు నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వలంటీర్లకు పలు సూచనలు చేశారు. రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పులు తలెత్తకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.


