● అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణ
హన్మకొండ : రాష్ట్రంలో ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏ ర్పాటు చేయాలని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ వంద ఫీట్ల రోడ్‌లోని అట్టూ బ్యా లెన్స్ ఫిజియోథెరఫీ క్లినిక్‌లో నిర్వహించిన అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లా డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఫిజియోథెరపీ విభాగాలు ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సుముఖంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఫిజియోథెరపీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, వైద్యులు, మెరుగైన వ్యవస్థ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రత్యేక ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయడంతోపాటు ప్రతీ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ప్రత్యేక ఫిజియోథెరపీ విభాగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. అసోసియేషన్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రాము, ఫిజియోథెరపిస్టులు డాక్టర్ శివరామకృష్ణ, వంశీ, క్రాంతి, ప్రకాశ్, సు రేశ్, రాజు మల్లేశ్, రాకేశ్, మధులత పాల్గొన్నారు.


