ఐసీఎంఆర్‌ గ్రాంట్లకు నేత్ర వైద్యశాల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఐసీఎంఆర్‌ గ్రాంట్లకు నేత్ర వైద్యశాల గుర్తింపు

Sep 16 2026 4:07 AM | Updated on Sep 16 2026 4:07 AM

కాశిబుగ్గ : వరంగల్‌లోని ప్రాంతీయ నేత్ర వైద్యశాల తొలిసారి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)కు గ్రాంట్లకు గుర్తింపు పొందింది. 20 26 సంవత్సరానికి సంబంధించి వైద్యశాలకు చెందిన ముగ్గురు ఆప్తాల్మాలజీ జూనియర్‌ రెసిడెంట్‌ వై ద్యుల పరిశోధన ఽగ్రంథాలు ఎంపికయ్యాయి. ప్రొఫె సర్‌ డాక్టర్‌ వగ్గె శ్రీకుమార్‌ మార్గదర్శకంలో పరిశోధనలు చేస్తున్న జూనియర్‌ రెసిడెంట్లు డాక్టర్‌ గోగికర్‌ రమ్య, డాక్టర్‌ మాతం ప్రసన్నలక్ష్మి, డాక్టర్‌ దబ్బర హరిత సాయిలు సమర్పించిన దీసీస్‌లు ఎంపిక కా వడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీ కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఐ హాస్పిటల్‌లో తాను గైడ్‌ చేస్తున్న ముగ్గురు జూనియర్‌ వైద్యులు మొదటిసారి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు భావితరాల వైద్యులకు మార్గదర్శకం నిలుస్తాయని పేర్కొన్నారు. కాగా, ముగ్గురు జూనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు ఎంపిక కావడంపై హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ రవిశేఖర్‌, కేఎంసీ ప్రిన్సిపాల్‌ మోహన్‌దాస్‌.. గైడ్‌ డాక్టర్‌ శ్రీ కుమార్‌తో పాటు పరిశోధకులను అభినందించారు.

ముగ్గురు రెసిడెంట్‌ వైద్యుల పరిశోధన గ్రంథాలు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement