● విద్యుత్ శాఖ ఎస్‌ఈ దర్శన్ కుమార్
మరిపెడ రూరల్: రైతుల పంటలకు అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ దర్శన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మరిపెడ మండలంలోని ఎల్లంపేట సబ్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. రైతుల ధర్నాకు గల కారణాలను అధికారును అడిగి తెలుసుకున్నారు. లైన్ల మరమ్మతులు, కెపాసిటర్ బ్యాంకులు, ఇంటర్‌లింగ్ లైన్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాసరావు, ఏఈలు పాండునాయక్, రూబీనా, సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలి
చిన్నగూడూరు: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ దర్శన్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ సందర్శించారు. విద్యుత్ సరఫరాను తీరును పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


