అటవీ అమరుల సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

అటవీ అమరుల సేవలు చిరస్మరణీయం

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

జిల్లా అటవీశాఖ అధికారి బి.లావణ్య

మహబూబాబాద్‌ రూరల్‌: విధి నిర్వహణలో అసువులుబాసిన అటవీ అధికారులు, సిబ్బంది సేవలు చిరస్మరణీయమని జిల్లా ఆటవీశాఖ అధికారి బి.లావణ్య అన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ఆటవీ శాఖ అధికారికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో అటవీ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ లావణ్య మాట్లాడుతూ.. అడవుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది అడవుల సంరక్షణకు పాటుపడుతున్న సందర్భంలో ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డివిజనల్‌ అటవీ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, మానుకోట, బయ్యారం, తొర్రూరు ఎఫ్‌ఆర్‌ఓలు సురేష్‌, రవికిరణ్‌, విజయలక్ష్మి, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఎఫ్‌ఆర్‌ఓ మంగీలాల్‌, డీఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్బీఓలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement