నెహ్రూసెంటర్: భవన నిర్మాణరంగంలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మాణరంగంలో లక్షలాది మంది కార్మికులు గుర్తింపు లేకుండా ఉన్నారని, వారందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకన్న, ఉప్పలయ్య, కొమురయ్య, పి.రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


