కేయూకు నేడు పనిదినం | - | Sakshi
Sakshi News home page

కేయూకు నేడు పనిదినం

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని విభాగాలు, కార్యాలయాలు, వర్సిటీ కాలేజీలు, వర్సిటీ పరిధిలోని కళాశాలలకు ఈనెల 12న పనిదినంగా పరిగణిస్తున్నారు. గత నెల 28న రాఖీఫౌర్ణమిని పురస్కరించుకొని రిజిస్ట్రార్‌ రామచంద్రం సెలవు ప్రకటించిన విషయం విధితమే. ఆ సెలవుకు బదులుగా శనివారం పనిదినంగా పరిగణిస్తూ రిజిస్ట్రార్‌ సర్క్యులర్‌ జారీచేశారు.

మద్యానికి బానిసై

ఉపాధ్యాయుడి మృతి

పర్వతగిరి: మద్యానికి బానిసై ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడ భీమానాయక్‌ (45) పర్వతగిరిలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కొంతకాలంగా అతిగా మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం తాగి పాఠశాలకు రావొద్దని ఆయనకు హెచ్‌ఎం చెప్పారు. దీంతో సదరు టీచర్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. కల్లెడ గ్రామంలోని తన నివాసంలో భీమానాయక్‌ గురువారం రాత్రి అతిగా మద్యం తాగి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం గమనించిన భార్య అరవింద.. పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు.

రేషన్‌ బియ్యం నిల్వలపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

ఖిలా వరంగల్‌: ఓ ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన రేషన్‌ బియ్యం నిల్వలపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడిచేసి రూ.1,27,500 విలువైన 35 క్వింటాళ్ల సన్నబియ్యం, 2వేల గన్నీ బ్యాగులు, వేయింగ్‌ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారెడ్డి తెలిపారు. వరంగల్‌ లేబర్‌ (క్రిస్టియన్‌) కాలనీలో ఆటోడ్రైవర్‌ గోవిందుల గణేష్‌.. పలు కాలనీల్లో సంచరించి ప్రజల వద్ద తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి ఓ ఇంట్లో నిల్వచేసి ఇతర వ్యాపారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు సమాచారం అందింది. ఏసీపీ మధుసూదన్‌ ఆదేశాల మేరకు గణేష్‌ ఇంటి పై టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారెడ్డి తన సిబ్బందితో కలిసి దాడిచేసి రేషన్‌ బియ్యాన్ని స్వాఽ దీనం చేసుకుని అతడిపై కేసు నమోదు చేశాడు. త దిపరి చర్యల కోసం మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు కే సును అప్పగించినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు. కా ర్యక్రమంలో ఎస్సై ఉప్పలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

ఖిలా వరంగల్‌: ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌పోర్స్‌ అధికారులు దాడి చేసి రూ.21,990ల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, ప్లేకార్డులు స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీధర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వరంగల్‌ శివనగర్‌లోని నోతి శ్రీను ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌కు సమాచారం అందింది. ఈ మేరకు శ్రీను ఇంటిపై టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీధర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం దాడిచేసి పెరకవాడకు చెందిన తోట రాజు, శివనగర్‌కు చెందిన చావళ్ల రాజేష్‌, చావళ్ల సతీష్‌, బొల్లం సతీష్‌, సూదం సందీప్‌, ములుగు విజయ్‌ను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి, వారి నుంచి రూ. రూ.21 990నగదు, ఐదు మొబైల్‌ ఫోన్లు, ప్లేయింగ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ వివరించారు. తదిపరి చర్యల నిమిత్తం కేసును మిల్స్‌కాలనీ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. దాడిలో ఎస్సై వీరస్వామి, కానిస్టే బుళ్లు సంతోష్‌రెడ్డి, రాధిక పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement