నూతన చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

నూతన చట్టాలపై అవగాహన అవసరం

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

కమాండెంట్‌ ఎన్‌వీ సత్య శ్రీనివాస్‌రావు

మామునూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక, సాంకేతికత పరిజ్ఞానం, క్రిమినల్‌ చట్టాలపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలని టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్‌ కమాండెంట్‌ ఎన్‌వీ సత్య శ్రీనివాస్‌రావు సూచించారు. వరంగల్‌ మామునూరు టీజీఎస్పీ నాలుగో బెటాలియన్‌లో ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, ఎస్సై రాధిక ఆధ్వర్యంలో నూతన చట్టాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతీ పోలీసు నూతన చట్టాలపై పూర్తిపట్టు సాధించాలన్నారు. 2024, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారత సాక్ష్య అధినియమం (బీఎన్‌ఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌, బీఎన్‌ఏ) కీలక అంశాలు, పాత ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో వచ్చిన చట్టాల్లో నేరాలు – శిక్షలు, నేర విచారణ విధానం, సాక్ష్యాధారాలు, నిబంధనలపై సత్యశ్రీనివాస్‌రావు అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో ఏసీ రాజేందర్‌, ఆర్‌ఐలు కార్తీక్‌, రవి, సర్వర్‌, రాజ్‌కుమార్‌, కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement