● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చేస్తే, చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడు సంవత్సరాల జైలు, 50 వేల జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వీరాజిత, డెమో రాజ్‌కుమార్, మనోహర్, అనిల్, ప్రశాంత్ పాల్గొన్నారు.
అవగాహన శిబిరాలు నిర్వహించాలి..
హెచ్‌ఐవీపై అవగాహన శిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు క్యూర్‌కోడ్ పద్ధతిలో డ్రాయింగ్, పోస్టర్ పద్ధతిలో హెచ్‌ఐవీపై అవగాహన కల్పించాలన్నారు. హెచ్‌ఐవీ నివారణపై ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. సమావేశంలో డాక్టర్ అర్జున్, జ్యోతి, ఎంఎల్‌హెచ్‌పీలు తదితరులు పాల్గొన్నారు.


