● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
మహబూబాబాద్: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలో చాకలి ఐలమ్మ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె చూపిన ధైర్య సాహసాలు, స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్పార్క్ ఫేస్ ఆఫ్ ఇండియా–26కు నిట్ డైరెక్టర్ ఎంపిక
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీని ఇండియా స్పార్క్ సంస్థ ఇండియా స్పార్క్ ఫేస్ ఆఫ్ ఇండియా–26కు ఎంపిక చేసి గురువారం సత్కరించింది. 2023వ సంవత్సరం నుంచి నిట్ వరంగల్ డైరెక్టర్‌గా, 30 ఏళ్ల నుంచి విద్యా పరిశోధన రంగాల్లో వివిష్ట ప్రతిభ కనబరుస్తున్న నిట్ డైరెక్టర్‌ను ఇండియా స్పార్క్ ఫేస్ ఆఫ్ ఇండియా–26కు ఎంపిక చేసినట్లు ఇండియా స్పార్క్ సంస్థ సీఈఓ రూపా తంతి తెలిపారు.


