నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

హసన్‌పర్తి : ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత అధికారులకు సూచించారు. వరంగల్‌ పోలీస్‌ కమి షనరేట్‌ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్‌ కేసు ల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల ప్రగతి తదితర అంశాలపై గురువారం కమిషనరేట్‌ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు, సంబంధిత పోలీసు అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించి, వా టి దర్యాప్తు ఏ దశలో ఉందనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్‌ కేసుల్లో నిందితులు పరారీ లో ఉంటే ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏ ర్పాటు చేసి, అందుబాటులో ఉన్న సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగిస్తూ త్వరితగతిన అరెస్టు చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై నేరా లు, ఆస్తి, సైబర్‌ నేరాల దర్యాప్తును పారదర్శకంగా, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ అధికారి తమ పరిధిలో గణపతి నవరాత్రులు ప్రశాంత వాతావరణం నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌ పరిధిలో మ త్తుపదార్థాల నియంత్రణలో ప్రతిభ కనబరుస్తున్న డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపి రివార్డులు అందజేశారు. డీసీపీలు అంకిత్‌ కుమార్‌, దార కవిత, రాజమహేంద్ర నాయక్‌, కిషన్‌ సింగ్‌, అదనపు డీసీపీలు ప్రభాకర్‌ రావు, బాలస్వామి, సురేష్‌ కుమార్‌ శ్రీనివాస్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement