● కలెక్టర్ స్నేహ శబరీష్
బయ్యారం: భూసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని గంధంపల్లి రెవెన్యూ గ్రామంలో కొనసా గుతున్న భూసర్వేను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సర్వే బృందాలు నిర్వహిస్తున్న రోవర్ల వినియోగం, హద్దుల గుర్తింపు, డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియ, ఫీల్డ్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ సర్వే బృందంతో మాట్లాడుతూ.. సరిహద్దు వివాదాలకు తావులేకుండా భూ యజమానుల సమక్షంలోనే కచ్చితమైన కొలతలు నిర్వహించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రికార్డులను పారదర్శకంగా నమోదు చేయాలన్నారు.
నిధులు విడుదల చేయాలని వినతి..
కొత్తపేట పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన మోటారు, పైపులైన్‌కు నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌కు సర్పంచ్ ప్రవీణ్‌నాయక్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, సర్వేయర్ శివ తదితరులు పాల్గొన్నారు.


