మహబూబాబాద్: జిల్లాలోని రైస్‌మిల్లర్లు మిల్లింగ్ కార్యకలాపాలను నిలిపివేసి సమ్మెలో పాల్గొనాలని రైస్‌మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వోలం కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వోలం కృష్ణమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెలో జిల్లా రైస్‌మిల్లర్లు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. అధికారులు సీఎంఆర్ విషయంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేసి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఒత్తిడి లేకుండా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా సీఎంఆర్ డెలివరీ చేయడానికి అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైస్ మిల్లర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.


