కాజీపేట అర్బన్ : సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, దళితుడైన బీఆర్ గవాయిపై నాడు, రాష్ట్రశాసనసభ స్పీకర్ దళితుడైన గడ్డం ప్రసాద్‌పై కుల వివక్ష కొనసాగుతూనే ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ఎమ్మార్పీ ఎస్, ఎమ్మెస్పీ జాతీయ సదస్సులో మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న కుల, వర్ణ, మత, లింగ, వివక్షలను ని ర్మూలించడమే మన లక్ష్యమన్నారు. 30ఏళ్ల సుదీర్ఘ ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే ఏపీ, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని, ఆరోగ్యశ్రీ పథకం, వికలాంగులు, వృద్ధులు, వితంతు పెన్షన్‌లు వ చ్చాయన్నారు. అక్టోబర్ 7న ఏపీ అమరావతిలో 1,200 మండల కమిటీలతో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగను గజమాలతో సత్కరించారు. ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్సీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ


