నత్తనడకన ‘ఇన్‌స్పైర్‌’.. | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన ‘ఇన్‌స్పైర్‌’..

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

రాష్ట్రంలో ప్రస్తుతం టాప్‌గా మహబూబాబాద్‌ జిల్లా

గత విద్యాసంవత్సరంలో ఉమ్మడి జిల్లాకు 433 అవార్డులు

విద్యారణ్యపురి : అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, యూపీఎస్‌లు, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, గురుకులాల్లోని విద్యార్థుల్లో శాసీ్త్రయ, వైజ్ఞానిక ఆలోచనలు, సృజనాత్మకతను ప్రోత్సహించి వారిని భావిశాఽస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది ‘ఇన్‌స్పైర్‌ మనాక్‌’ అవార్డ్స్‌ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2026–2027 విద్యాసంవత్సరంలో విద్యార్థుల నుంచి నామినేషన్లు ఆహ్వానించే ప్రక్రియ ఈ ఏడాది జూలై 15 నుంచి ప్రారంభమైంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 15వ తేదీవరకు గడువు ముగియనుంది. అయితే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నామినేషన్ల లక్ష్యం చేరుకోలేదు. ఐదు జిల్లాల్లో నామినేషన్ల సమర్పణ నత్తనడకనే కొనసాగుతోంది.

అర్హులు వీరే..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇన్‌స్పైర్‌ మనాక్‌ పురస్కారాలు పొందేందుకు అర్హులుగా ఉన్నారు. ఒక్కో పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టుల వరకు పంపొచ్చు. అందుకు ఉపాధ్యాయులు నామినేషన్లను సంబంధిత వెబ్‌సైట్‌లో హెచ్‌టీటీపీ//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్‌స్పైర్‌అవార్డ్స్‌– డీఎస్‌టీ .గౌట్‌.ఇన్‌ సమర్పించాల్సింటుంది(నమోదు చేయాల్సింటుంది)

ఎంపికై తే రూ. 10 వేల చొప్పున అందజేత

నామినేషన్‌ ఇన్‌స్పైర్‌కు ఎంపికై తే దానిని పంపిన విద్యార్థికి రూ. 10 వేల చొప్పున ప్రోత్సాహకం ఇస్తారు. విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమచేస్తారు. తొలుత జిల్లా స్థాయిలో ఆతర్వాత ఎంపికై న వారికి రాష్ట్రస్థాయిలో,అందులో ఎంపికై తే జాతీయ స్థాయి వరకూ విద్యార్థులు తమలోని వైజ్ఞానిక ప్రతిభను ప్రధర్శించే వీలు కలుగుతుంది. అలాంటి ఇన్‌స్పైర్‌కు విద్యార్థులను ప్రోత్సహించి నామినేషన్లు నమోదు చేయించడంలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా స్సైన్స్‌ అధికారులు కూడా తమ జిల్లాలో ఇన్‌స్పైర్‌పై సంబంధిత ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అయినా వివిధ జిల్లాలో విద్యార్థుల నుంచి నామినేషన్ల నమోదు ప్రక్రియ ఇంకా నత్తనడకనే సాగుతోంది.

జిల్లాల వారీగా వివరాలు..

జిల్లా పేరు స్కూళ్ల నామినేషన్ల నామినేషన్ల

సంఖ్య టార్గెట్‌ మొత్తం

హనుమకొండ 395 1,975 223

వరంగల్‌ 344 1.720 212

జనగామ 195 975 187

ములుగు 112 560 48

జేఎస్‌భూపాలపల్లి 131 655 83

మహబూబాబాద్‌ 233 1,165 1,044

టార్గెట్‌కు దూరంగా

ప్రాజెక్టుల నామినేషన్లు

ప్రస్తుతం ఒక్క మహబూబాబాద్‌

జిల్లానే టాప్‌

మిగతా ఐదు జిల్లాలు

లక్ష్యం చేరేనా ?

ఈనెల 15వ తేదీ వరకే గడువు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇన్‌స్పైర్‌ మనాక్‌ పురస్కారాలకు విద్యార్థుల నుంచి నామినేషన్లను నమోదు చేసుకున్న సంఖ్యను ఈనెల 8వ తేదీ వరకు పరిశీలిస్తే ఆరు జిల్లాలు కూడా టార్గెట్‌ చేరుకోలేదు. కానీ మహబూబాబాద్‌ జిల్లా మాత్రం 1,044 నామినేషన్‌తో రాష్ట్రంలోనే టాప్‌గానే నిలిచింది. ఈజిల్లాకు టార్గెట్‌ మాత్రం 1,165 చేయాల్సింది. లక్ష్యానికి దగ్గరగానే ఉంది. మిగతా ఐదుజిల్లాలు హనుమకొండ, వరంగల్‌, ములుగు, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లిలో మాత్రం నత్తనడకనే లక్ష్యానికి బహు దూరంగానే ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత జిల్లాల ఉపాధ్యాయులు చొరవ తీసుకుని విద్యార్థులను ప్రోత్సహిస్తూ నామినేషన్ల నమోదుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా సైన్స్‌ అధికారులు కోరుతున్నారు.

గత విద్యాసంవత్సరంలో 2025–2026లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు 433 ఇన్‌స్పైర్‌ అవార్డులు లభించాయి. ఆయా విద్యార్థులకు రూ 10వేల చొప్పున బ్యాంకు ఖాతాలో డబ్బులు జమఅయ్యాయి. ఆయా విద్యార్థులకు ఈఏడాది నవంబర్‌–డిసెంబర్‌లో ప్రతీజిల్లాలోనూ జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిట్స్‌ ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో 2026–2027లో ఎన్ని లభిస్తాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement