ఉద్యోగాల పేరుతో మోసం.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో మోసం..

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

కాజీపేట : ఇన్‌కాం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పింగిళి ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. ఈమేరకు బుధవారం కాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్యాంసుందర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పాత నేరస్తుడు మెట్టు ప్రవీణ్‌కుమార్‌ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఐటీ శాఖలో తనకున్న పరిచయాల ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నాడు. గతంలో చాలా మందికి ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగాలు ఇప్పించినట్లు ఫోర్జరీ పత్రాలు చూపించి నమ్మించే వాడు. నిరుద్యోగుల వద్ద రూ.లక్షల్లో వసూలు చేసి వారిని నమ్మించడానికి మెడికల్‌ టెస్ట్‌లు, పోలీస్‌ వెరిఫికేషన్‌ లాంటి పనులు చేసేవాడు. దాదాపు 10 మంది నిరుద్యోగుల వద్ద రూ.85లక్షల నగదు, 4 తులాల బంగారం, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకున్నాడు. అయితే బాధితులు ఉద్యోగాల కోసం అడగగా కాలయాపన చేయడంతోపాటు డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని నిజామాబాద్‌లో అరెస్ట్‌ చేసి వరంగల్‌ తీసుకొచ్చారు. నిందితుడి నుంచి కారు, ల్యాప్‌టాప్‌, రూ.2 లక్షల నగదు, రెండు ఫోన్లతోపాటు ఐదుగురు బాధితులకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్‌లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన సీఐ శ్యాంసుందర్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా, ఎస్సైలు మౌనికా రెడ్డి, శివకుమార్‌, తాళ్లపల్లి యాదగిరి, క్రైం పీసీలు వి.క్రాంతికుమార్‌, జి.కుమారస్వామిని ఏసీపీ అభినందిస్తూ నగదు పురస్కరాలు అందజేశారు. కాగా, ప్రవీణ్‌కుమార్‌పై రాష్ట్రంలోని దాదాపు 8 పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

నిందితుడి అరెస్ట్‌, రిమాండ్‌

వివరాలు వెల్లడించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement