సెల్లార్లు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సెల్లార్లు ఏర్పాటు చేయాలి

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

సెల్లార్‌ లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేయడం వల్లే ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. కనీసం పార్కింగ్‌ స్థలాలు కూడా ఏర్పాటు చేయలేదు. పలుచోట్ల సెల్లార్‌ల్లో షాపులు ఏర్పాటు చేశారు. వాటిని కూల్చివేయాలి. తొర్రూరు బస్టాండ్‌ సెంటర్‌ వద్ద రోడ్డు మధ్యలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

– మేక విజయభాస్కర్‌రెడ్డి,

వాహనదారుడు

ట్రాఫిక్‌ సమస్యతో

ఇబ్బందులు పడుతున్నాం

నెహ్రూసెంటర్‌, మదర్‌థెరిస్సా సెంటర్‌తో పా టు రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో రోడ్లపై వాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– కుమారస్వామి, స్థానికుడు

నోటీసులు ఇస్తాం

సెల్లార్‌లు లేని బహుళ అంతస్తుల భవనాలకు నోటీసులు ఇస్తాం. సెల్లార్‌లోని షాపులను తొలగించి పార్కింగ్‌కు కేటాయిస్తాం. సెల్లార్‌ లేని భవన యజమానులు పార్కింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇస్తాం. సెల్లార్‌ లేదా పార్కింగ్‌ లేకుండా కొత్తగా బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇవ్వం.

– సంతోష్‌, టీపీఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement