రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

పెద్దవంగర: భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌ అధికారులను అదేశించారు. మంగళవారం మండలంలోని పోచారం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ తహసీల్దార్‌ వినోద్‌ కుమార్‌ను సర్వే వివరాలపై ఆరా తీయగా.. గ్రామంలో 821 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపా రు. ఇందులో ఆబాది, పీఆర్‌రోడ్డు, ఎస్సారెస్పీ కాల్వ, చెరువు తదితరు భూములు ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 253 ఎకరాల సర్వే చేసినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, భూ వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ సూచించారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ నితీష్‌, ఏడీ శ్రీనివాస్‌, సర్వేయర్‌ ఉపేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement