ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

మహబూబాబాద్‌: అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్‌లో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సత్యవతి రాఽథోడ్‌ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని, తిరిగి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలలో మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగినా మంత్రి సీతక్క స్పందించకపోవడం దారుణమన్నారు. మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్‌ చేస్తే కూడా స్పందించలేదని, దీంతో ఆమెకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మాజీ ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు, మహిళలపై పోలీసులు దాడులు చేయడం సబబు కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి , మార్నేని వెంకన్న, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, గద్దె రవి, యాళ్ల మురళీధర్‌రెడ్డి, నాయిని రంజిత్‌, అశోక్‌, నీరజా, రాజ్‌కుమార్‌, రఘు, లింగన్న పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై దాడి హేయమైన చర్య

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement