కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా
మహబూబాబాద్ రూరల్ : అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. అదే సమయంలో కేసీఆర్ దిష్టిబొమ్మకు నిప్పు పెట్టగానే కాంగ్రెస్ నాయకుడిపై నిప్పురవ్వలు పడ్డాయి. వెంటనే ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టి మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ తాతా మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటనాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాస్, నాయకులు ఎడ్ల రమేష్, ఎండి,హారుణ్, కౌన్సిలర్లు సల్వాది దిలీప్, బోడ రవికుమార్, నిమ్మల మాధవి శ్రీని వాస్, బానోత్ పార్వతిభాస్కర్, పద్మం ధనలక్ష్మిప్రవీణ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్, అర్బన్ ఎస్టీ సెల్ చైర్మన్ తేజావత్ శంకర్, లింగాల వీరభద్రం, గిరిధర్ గుప్తా, సప్పిడి రంజిత్, గపూర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.


