కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ఈనెల 19, 20 తేదీల్లో 24వ స్నాతకోత్సవం (కాన్వొకేషన్) నిర్వహించనున్నట్లు యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. యూజీ, పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన 2,350 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు. తొలిరోజు యూజీ (బీటెక్), రెండో పీజీ(ఎంటెక్), పీహెచ్‌డీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. ముఖ్య అతిథిగా టెక్సాస్ ఇన్‌స్ట్రూమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్‌కుమార్ హాజరుకానున్నారు.
● 19, 20 తేదీల్లో కాన్వొకేషన్ వేడుకలు
● హాజరుకానున్న టెక్సాస్ ఎండీ సంతోష్‌కుమార్


