ఏకలవ్య స్కూల్‌ విద్యార్థులకు అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

ఏకలవ్య స్కూల్‌ విద్యార్థులకు అస్వస్థత

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని గూడూరు ఏకలవ్య మోడల్‌ స్కూల్‌కు చెందిన 19 మంది విద్యార్థులు అస్వస్థతతకు గురై ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సోమమంగళవారాల్లో చికిత్స పొందారు. పలు విద్యార్థి సంఘాల నాయకుల కథనం ప్రకారం.. గురుకుల పాఠశాల విద్యార్థులు ఆదివారం ఉదయం టిఫిన్‌ (పూరి), మధ్యాహ్నం చికెన్‌తో భోజనం చేశారు. అయితే ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆర్సీఓ నారాయణనాయక్‌.. మోడల్‌ స్కూల్‌ను సందర్శించి ప్రిన్సిపాల్‌ రమేశ్‌ను వివరణ అడిగారు. విద్యార్థులను చిన్న సమస్యలతో ఆస్పత్రికి తరలించామన్నారు. అంతేకాని తమ గురుకుల పాఠశాలలో ఎలాంటి ఫుడ్‌పాయిజన్‌ కాలేదన్నారు. అనంతరం ఆర్సీఓ నారాయణనాయక్‌, సీఐ అంజలి, విద్యార్థి సంఘాల నాయకులు మధ్యాహ్నం భోజనం పరిశీలించి విద్యార్థులతో పాటు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆర్సీఓ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ చేశామని, విద్యార్థులకు ఎలాంటి ఫుడ్‌పాయిజన్‌ జరగలేదన్నారు.

జిల్లా ఆస్పత్రిలో చికిత్స

ఫుడ్‌ పాయిజన్‌ అయ్యిందని

విద్యార్థి సంఘాల ఆరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement