కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణ పనులు చేపడు తున్నారు. దీంతో రోడ్లకు ఇరువైపులా ఉన్న సైడ్ కాల్వలను కూల్చివేశారు. అంబేడ్కర్ సెంటర్, ఉప్పరపల్లి రోడ్డు, కేసముద్రంవిలేజ్ వైపు ఇళ్ల నుంచి వచ్చే మురుగు, వర్షపునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో దుర్వాసన రావడంతోపాటు దోమలు వృద్ధి చెంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా పైపులైన్లు తరచూ పగులుతుండడంతో తాగునీరు కలుషితమవుతోంది. ఖాళీ స్థలాల్లో ముళ్లచెట్లు ఏపుగా పెరగడంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల వల్ల ప్రజల కంటిమీద కునుకులేకుండా పోతుంది. పైపులైన్ వేసేందుకు పలుచోట్ల తవ్విన కందకాలను అలాగే వదిలేయడంతో ప్రమాదకరంగా మారాయి.


