అరాచకాలను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

అరాచకాలను అరికట్టాలి

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం, నల్లగొండ జిల్లా కార్యాలయం, నాయకులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంగ్రెస్‌ పార్టీ నాయ కుల అరాచకాలను అరికట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, బెదిరింపులు, అరాచకాలకు పాల్పడే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. అనంతరం వివేకానంద సెంటర్‌లో బీజేపీ, బీజేవైఎం నాయకులు నిరసన తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పద్మావతి, జిల్లా కార్యదర్శులు సతీష్‌, రామోజీ, నాగరాజు, హిందూభారతి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement