మహబూబాబాద్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ వడ్డెబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీజీఈ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట పెన్షన్ విద్రోహ దినంలో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. వెంటనే రెండో పీఆర్సీ ప్రకటించాలన్నారు. జీవిత భద్రతకు ఓపీఎస్ ఎంతో కీలకమన్నారు. సీపీఎస్ వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నా రు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రఫీ, మురళీకృష్ణ, ఫెరోజ్, రమేశ్, రోహిత్, ప్రసాద్, మైస నాగయ్య పాల్గొన్నారు.


