పట్టణంలో దుర్గంధం | - | Sakshi
Sakshi News home page

పట్టణంలో దుర్గంధం

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

తొర్రూరు: పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా మారింది. అన్నారం రోడ్డులో రహదారి వెంట చెత్త, చెదారం రోజుల తరబడి తొలగించకుండా అలాగే వదిలేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి ఆస్పత్రి సమీపంలో డ్రెయినేజీలో మద్యం దుకాణం పక్కన డిస్పోజబుల్‌ గ్లాస్‌లు, వ్యర్థాలు పేరుకుపోయాయి. నీరు నిలిచి ఆ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త తొలగించకపోతే సీజనల్‌ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మున్సిపాలిటీ అధికారులు స్పందించి మురుగు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

తొర్రూరులోని అన్నారం రోడ్డులో నిలిచిన మురుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement