● ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో
కొత్తగూడ: విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో క్రీడా పాఠశాల ఉపాద్యాయులు, పీడీ, పీఈటీలకు సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాలను శనివారం ఆయన సందర్శిచారు. క్రీడా మైదానం పరిశీలించి అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు నివేదిక తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల్లో మెళకువలు నేర్పించేందుకు చేపడుతున్న కార్యకలాపాలపై అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్‌లో జరిగే ఖేలో ఇండియాలో ఎక్కువ పతకాలు సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ద్యాన్ చంద్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీడీ దేశీరాం, హెచ్‌ఎం సారయ్య, పీడీలు పాల్గొన్నారు.
ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో
క్రీడల్లో రాణించాలి
మహబూబాబాద్ అర్బన్: హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శని వారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు క్రీడాకోటలో ప్రభుత్వంతోపా టు, వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడాదినోత్సవం సందర్భంగా వర్చువల్ పద్ధతిలో క్రీడలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఐఈఓ మదార్‌గౌడ్ కళాశాల ప్రిన్సిపాల్ గణేష్, కోచ్‌లు కుమారస్వామి, రాంబాబునాయక్, దాక్షినాయక్ పాల్గొన్నారు.


