● ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ
సంచాలకులు యాస్మిన్ భాషా
మహబూబాబాద్ రూరల్ : ఆయిల్ పామ్, ఉద్యాన, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగుపై ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు యాస్మిన్ భాషా శనివారం హైదరాబాదు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎకరానికి రెండు రూ.లక్షల వరకు ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్ పామ్, అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ, నూతన పంటలైన కోకో, కొబ్బరి, వక్క, అవకాడో, తదితర పంటల సాగుపై వివరించారు. పంట మార్పిడి ద్వారా ఉద్యాన పంటలు, మల్బరీ విస్తీర్ణాన్ని పెంచాలని తెలిపారు. రైతులకు నిత్యం సాగులో మెళకువలు తెలుపుతూ రాయితీలు అందించాలని, బోర్ల కింద ఆయిల్ పామ్, పండ్ల తోటలు, కూరగాయలు, పూలు, మల్బరీ, పలు రకాల ఉద్యాన పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న, ఉద్యాన అధికారులు శాంతిప్రియ, శాంతిప్రియదర్శిని, స్రవంతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


