● గతనెలలోనూ వచ్చిన పాము
● భయాందోళనకు గురవుతున్న పిల్లలు
మరిపెడ రూరల్: మరిపెడ మండల పరిషత్ ఆవరణలోని భవిత కేంద్రం (ప్రత్యేక అవరాల పిల్లల వనరుల కేంద్రం)లోకి శనివారం విషసర్పం ప్రవేశించింది. పామును గమనించిన ఉపాధ్యాయురా లు అప్రమత్తమై బయటకు వచ్చి స్థానికులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న గిరిపురం మాజీ సర్పంచ్ పెద్దబోయిన జనార్ధన్ బాత్రూంలో దాగిఉన్న పామును బయటకు తీయడంతో ప్రమా దం తప్పింది. గత నెలలోనూ ఇదే కేంద్రంలోకి పాము చొరబడింది. వరుస పాముల బెడదతో దివ్యాంగుల పిల్లలు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి భవిత భవనం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


