● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో డీఈఓ, ఎంఈఓలతో విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యాశాఖపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఆంగ్ల భాషపై ఆసక్తి, ఆత్మ విశ్వాసం పెరిగే విధంగా కృషి చేయాలన్నారు. ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేసేలా అధికారులు పాటుపడాలన్నారు. సమావేశంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


