చిన్న తప్పుల సవరణకు ఓకే.. | - | Sakshi
Sakshi News home page

చిన్న తప్పుల సవరణకు ఓకే..

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

సాక్షి, మహబూబాబాద్‌: భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం జిల్లాలో ఓటరు సవరణ ప్రక్రియ ముగిసింది. అయితే నూతన విధానంతో అనేక మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. ఓటరుకు ఒకే చోట ఓటు ఉండాలనే ఆలోచనతో జిల్లాలోని మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో కొన్ని ఓట్లు తొలగించారు. మరికొన్ని ఓట్లకు మ్యాపింగ్‌ ఇవ్వలేదు. కొన్ని ఓట్లు తప్పులు ఉన్నాయని చూపించారు. అయితే తొలగించిన ఓట్లు పోగా మ్యాపింగ్‌ చేయనవి, తప్పుల జాబితాలో ఉన్న ఓటర్లను మరోసారి పరిశీలించే పనిలో అధికారులు ఉన్నారు. వారందరికీ నోటీసులు జారీచేసి వారి వద్ద ఉన్న ఆధారాలతో సరిచేయనున్నారు. అయితే జిల్లాలో సవరణ జాబితాలో చిన్న చిన్న తప్పులు ఉన్నవే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని సరిచేసేందుకు వారివద్ద ఉన్న ఆధారాలను పరిశీలించనున్నారు.

80,903 మందికి నోటీసులు

జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లలో మ్యాపింగ్‌ చేయనివి, సవరణ జాబితాలో ఉన్నవారికి నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తం 4,84,935 మంది ఓటర్లలో 4,36,956 మంది ఓటర్ల ఎన్యూమరేషన్‌ ఫారాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. 47,979 మంది ఓటర్లను వివిధ కారణాలు చూపించి తొలగించారు. కాగా, 14,403 మంది ఓటర్లను ఇప్పటి వరకు మ్యాపింగ్‌ చేయలేకపోయారు. 66,500 మంది ఓటర్లను తప్పులు ఉన్నాయని సవరణ జాబితాలో చేర్చారు. అయితే మ్యాపింగ్‌, సవరణ జాబితాలో ఉన్న మొత్తం 80,903 మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చి వారి వద్ద ఉన్న ఆధారాలతో సరిచేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఓటరు తుది జాబితా ప్రకటన వరకు ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

తప్పులుగా పేర్కొన్న అంశాలు..

సవరణ జాబితాలో ఉన్న ఓటర్లలో మొత్తం 10 రకాలుగా విభజించి ఆయా అంశాల్లో తప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో తల్లిదండ్రులు–సంతానం మధ్య వయస్సు తేడా 15 సంవత్సరాల కంటే తక్కువ ఉండడం అంటే తల్లిదండ్రులు బిడ్డలకు మధ్య కనీసం 15సంవత్సరాల తేడా లేకుండా ఉండడంతో సవరణ జాబితాలో చేర్చారు. అదే విధంగా ఓటరు వయస్సు తల్లిదండ్రుల వయస్సు మధ్య 50 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండడం, ఓటరు..తాత/అమ్మమ్మ/నానమ్మ/తాతయ్య మధ్య వయస్సు తేడా 40 సంవత్సరాల కంటే తక్కువ, ప్రస్తుత ఓటరు జాబితా, గత జాబితాలో తండ్రి పేరు వేర్వేరుగా ఉండడం, ఒకే తల్లిదండ్రులకు లింక్‌ అయిన ఇద్దరు సంతానం మధ్య వయస్సు తేడా 9 నెలల కంటే తక్కువగా ఉండడం, తండ్రిగా పేర్కొన్న వ్యక్తి పేరుతో సంతానం ఆరుగురి కన్నా ఎక్కువగా ఉండడం, అదే విధంగా ఓటరు మ్యాపింగ్‌ చేసిన తల్లిదండ్రుల ఓట్లు చెల్లని జాబితాలో ఉండడంతో వారి సంతానం ఓట్లు మారే అవకాశం ఉందని సవరణ జాబితాలో చేర్చారు. ప్రస్తుత ఓటరు జాబితా, గతంలోని ఓటరు జాబితాతో పోల్చినప్పుడు పేర్లు వేర్వేరుగా ఉండడం, అంటే కొందరి పేర్లు మార్పు, మరికొందరు ఇంటిపేరు ముందు పెట్టడం, లేదా చివర పెట్టడం వంటి సంఘటనలతో ఇటువంటి వాటిని జాబితాలో చేర్చారు. ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న తండ్రి పేరు గత జాబితాలో ఉన్న తండ్రి పేరు మధ్య వ్యత్యాసం ఇలా.. పేరు, తండ్రి పేరు, తల్లిదండ్రుల లింకేజీ, వయస్సు తేడాలు, కుటుంబ సంబంధాల విషయంలో అనుమానాస్పద/తప్పుగా ఉండే అవకాశాలను గుర్తించే ప్రమాణాలుగా పేర్కొన్నారు.

అర్హుల ఓటు భద్రం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఓటరు సవరణ ప్రక్రియలో జిల్లాలోని మ్యాపింగ్‌ చేయనివారు, సవరణ జాబితాలో చేరిన ఓటర్లలో అర్హుల ఓటు భద్రంగా ఉంటుంది. ఇందుకోసం అందరికీ నోటీసులు జారీ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఏఈఆర్‌ఓలను నియమించాం. ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. నోటీసులకు స్పందించండి. తప్పుగా నమోదైన ఓటును సవరించుకోండి.

– స్నేహశబరీష్‌, కలెక్టర్‌

బీఎల్‌ఓ గుర్తించినవి

4,36,956

47,979

4,84,935

14,403

66,500

మ్యాపింగ్‌ చేయని 14,403మంది ఓటర్లు

సవరణ జాబితాలో 66,500 ఓట్లు

వీరందరికీ నోటీసులు ఇచ్చే పనిలో అధికారులు

ఆధారాల పరిశీలన ద్వారా

సరిచేసేందుకు అవకాశం

ప్రత్యేక ఏఈఆర్‌ఓల నియామకం

నియోజకవర్గం ఓటర్లు బీఎల్‌ఓ తొలగింపు సవరణ మ్యాపింగ్‌

గుర్తించినవి జాబితా జాబితా చేయనవి

డోర్నకల్‌ 2,24,165 2,05,000 19,080 27,256 4,715

మహబూబాబాద్‌ 2,60,770 2,31,791 28,899 39,244 9,688

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement