రిటైర్డ్‌ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

మహబూబాబాద్‌: రిటైర్డ్‌ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాకేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పోరుబాటలో భాగంగా శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ధర్నాకు యాళ్ల మురళీధర్‌రెడ్డి అధ్యక్షత వహించగా రాకేష్‌రెడ్డి ముఖ్య అఽతిథిగా హాజరై మాట్లాడారు. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్‌ డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీ, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుిస్మిత సీఎం చిట్టా విప్పుతానని అడ్డగోలుగా మాట్లాడినా.. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించలేదని, అది కాంగ్రెస్‌ పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. మాజీ ఎంపీ మాలోత్‌ కవిత మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ విద్యకు సంబంధించిన జీఓ 97ను వెంటనే రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్డ్‌ ఉద్యోగుల ఈహెచ్‌ఎస్‌ అమలు జరిగేలా చూడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఇది సరికాదన్నారు. కాగా ధర్నాకు రిటైర్డ్‌ ఉద్యోగులు పదిమంది లోపు మాత్రమే హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వివేక్‌, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, ఫరీద్‌, నాయిని రంజిత్‌, శ్రీను, అశోక్‌, నీలేష్‌, రిటైర్డ్‌ ఉద్యోగులు బద్రినారాయణ, గోవర్ధన్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement