న్యూస్‌రీల్
శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రత పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకుడు తాటిపాముల దుర్గాప్రసాద్ అభిషేకం నిర్వహించి పట్టువస్త్రాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని చీరలతో అలంకరించి, లలిత సహస్రనామాలు జరిపించగా, బ్రాహ్మణోత్తములు తాటిపాముల నరసింహమూర్తి భక్తులచే వరలక్ష్మీవ్రతం జరిపించారు. పూజల అనంతరం మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో చౌడవరపు మంజువాణి, ఇమ్మడి రవికుమార్, తమ్మిశెట్టి నారాయణరావు, బొడ్ల కామేశ్వర్ రావు, శ్రీరాం పురుషోత్తం, మహిళా భక్తులు పాల్గొన్నారు.


