● రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు
లేక ప్రమాదాలు
● భయాందోళన వ్యక్తం చేస్తున్న
వాహనదారులు
జిల్లాలో పలుచోట్ల రోడ్ల వెంట ప్రమాదకరంగా బావులు
సాక్షి, మహబూబాబాద్: అందరం సురక్షిత ప్రయాణం చేయాలని అనుకుంటాం.. సుఖంగా గమ్యం చేరాలని ప్రయాణం మొదలు పెడతాం. అయితే ఈ ప్రయాణంలో వాహన డ్రైవర్ల అజాగ్రత్తతో పాటు ఎదురుగా వచ్చే వాహనాలు, రోడ్డు పరిస్థితి, రోడ్డు పక్కన ఉన్న బావులు, కాల్వలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు పక్కన ఉన్న బావులు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి. రక్షణ కంచెలతో పాటు ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారులపై పొంచి ఉన్న ప్రమాదాల పై సాక్షి ‘గ్రౌండ్ రిపోర్టు’తో ప్రత్యేక కథనం.
●
తాళ్లపూసపల్లి శివారులో..
కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదకరంగా వ్యవసాయ బావి ఉంది. ప్రధాన రహదారికి అతి సమీపంలో బావి ఉండడంతో నిత్యం కేసముద్రం మానుకోటకు మధ్య రాకపోకలు సాగించే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో పాటు, బావికి రక్షణ కంచెలు ఏర్పాటు చేయలేదు. రాత్రి సమయంలో మూలమలుపు వద్ద వాహనాలు అదుపు తప్పినట్లయితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.


