ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

Aug 19 2026 1:24 AM | Updated on Aug 19 2026 1:24 AM

మహబూబాబాద్‌: మానుకోట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనా యక్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధి 18వ వార్డులో రూ.60లక్షలు, 28వ వార్డులో రూ.40లక్షల అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నా రు. గత పాలకులు ఎన్నికలు సమీపించినప్పుడు మాత్రమే అభివృద్ధి పేరుతో హడావుడి చేశారన్నా రు. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. దశల వారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, వైస్‌ చైర్మన్‌ సూర్నపు సోమయ్య, కమిషన వినోద్‌కుమార్‌, డీఈఈ ఉపేందర్‌, కౌన్సిలర్లు బోల్లు రాజు, రేషపల్లి నవీన్‌, నాయకులు ఎడ్ల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement