మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించారన్నా రు. సామాన్య ప్రజల ఆత్మగౌరవం కోసం పో రాడారన్నారు. వెనుకబడిన, అణగారిన వర్గాలకు సమాజంలో సమాన గౌరవం, హక్కులు కల్పించాలనే పాపన్న ఆలోచనలు నేటి యువ తకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుగడువు పొడిగింపు
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని మల్యాల ఉద్యాన కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగించినట్లు కళాశాల అసోసియేట్ డీన్ ఆర్.ప్రీతం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అనుబంధంగా మల్యాల ఉద్యాన కళాశాల కొనసాగుతుందని పేర్కొన్నారు. మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈనెల 29వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. అలాగే నేరుగా కళాశాలలో దరఖా స్తుల సమర్పించడానికి 30వ తేదీ సాయంత్రం 5గంటల వరకు పొడిగించారన్నారు. ఆసక్తిగల విద్యార్థులు 94401 30030, 81304 11879 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పంటమార్పిడితో అధిక లాభాలు
కేసముద్రం: పంటమార్పిడి ద్వారా రైతులు లాభాలు పొందవచ్చని డీఏఓ విజయచంద్ర, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి మరి యన్న అన్నారు. మంగళవారం మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామంలో ఆధునిక సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, మిరప వంటి పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారని, అయితే వాటికి బదులు ఆయిల్‌పామ్, మల్బరీ, కూరగాయలు, పూలు, బొప్పాయి, ఉల్లి, నిమ్మ, జామ వంటి పంటలను సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ దిలీప్, శాస్త్రవేత్త ప్రశాంత్, రైతులు ఎస్.జైపాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన పాఠశాలల బలోపేతమే లక్ష్యం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో గిరిజన పాఠశాలల బలోపేతం కోసం ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి గుగులోతు దేశీరాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన కార్యాలయంలో మంగళవారం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశీరాంనాయక్ మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలను విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేస్తామన్నారు. పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలన్నారు. ఏటీడీఓ ఉపేందర్, ఏసీఎంఓ రాములు నాయక్, హెచ్‌ఎంలు శ్రీనివాస్, సారంగపాణి, బాబు, సారయ్య, సురేందర్‌రావు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి శంకర్‌నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. ద్విచక్రవాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ బలరాంనాయక్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


