శవ పరీక్ష.. | - | Sakshi
Sakshi News home page

శవ పరీక్ష..

Aug 19 2026 1:24 AM | Updated on Aug 19 2026 1:24 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026
జిల్లాలోని మార్చురీల్లో సమస్యలు తిష్ట

అపరిశుభ్రంగా ఉన్న మార్చురీ గది ఆవరణ

జీజీహెచ్‌లోని మార్చురీలో పగిలిన వాటర్‌ పైపులైన్‌

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో ప్రతీరోజు రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతు న్నాయి. కాగా, మృతదేహాల పోస్టుమార్టం చేయించేందుకు బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ సభ్యులు చనిపోయిన బాధకన్నా.. పోస్టుమార్టం చేయించేందుకు పడే తిప్పలే ఎక్కువగా ఉన్నాయి. మార్చురీ గది, చుట్టుపక్కల వాతావరణం సక్రమంగా లేకపోవడం, ఎప్పుడు పాములు, తేళ్లు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. ఫ్రీజర్‌ బాక్స్‌లు సరిపడా లేకపోవడం, ఉన్నవి పనిచేయకపోవడం, నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వంటి ఇబ్బందులతో శవాలను పడవేసే తీరును చూసి బంధువులు, కుటుంబ సభ్యులు చలించిపోతున్నారు.

అపరిశుభ్రంగా పరిసర ప్రాంతాలు..

పోస్టుమార్టం సెంటర్లు, పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. మహబూబాబాద్‌ సెంటర్‌లో పైపులైన్లు పగలడంతో పోస్టుమార్టం తర్వాత రక్తం కడిగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గదికి వెలుపల పాడైన స్ట్రెచర్స్‌, ఫ్రీజర్‌ బాక్స్‌లు, చెత్తా చెదారంతో నిండి ఉంది. దీంతో పాములు, తేళ్లకు ఆవాసాలుగా మారాయి. గూడూరు సెంటర్‌ గ్రామానికి చివరగా ఉన్నా.. అక్కడ సరైన వసతులు లేవనే ఆరోపణలు వస్తున్నాయి.

సాయంత్రం అయితే

బంద్‌..

జిల్లాలోని మహబూబాబాద్‌, గూడూరు పోస్టుమార్టం సెంటర్లను సాయంత్రం అయి తే బంద్‌ చేస్తారు. దీంతో శవాలు గదిలో, బంధువులు బయట జాగారం చేయాల్సి వస్తోంది. డ్యూటీ డాక్టర్లలో కొందరు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మృతుల బంధువులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం.. వారు వచ్చిందే డ్యూటీ అన్నట్లు ఉందని ఆరోపణలు ఉన్నాయి. మహబూబాబాద్‌, గూడూ రు సెంటర్లలో నెలకు సుమారు 50 శవాల పోస్టుమార్టం చేస్తున్నారు. అయితే తొర్రూరు, డోర్నకల్‌, పెద్దవంగర వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన మృతదేహాలకు రోజంతా గడిస్తే గానీ పొస్టుమార్టం చేయని పరిస్థితి నెలకొంది.

నీటి సరఫరా లేక ఇబ్బందులు

పనిచేయని ఫ్రీజర్‌ బాక్స్‌లు

సాయంత్రం అయితే పోస్టుమార్టం సేవలు బంద్‌

నరకయాతన అనుభవిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement