కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం గతానికి గర్వకారణం భవిష్యత్‌కు బలమైన పునాది. విద్య, నాణ్యమైన పరిశోధనల దిశగా కృషి చేస్తున్నాం. రూసా ప్రాజెక్టుకింద రూ.60కోట్ల నిధులు రాగా, రూ.35కోట్లతో 42పరిశోధన ప్రాజెక్టులు, రూ.15కోట్లతో కెహబ్ అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి అండర్‌గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు పూర్తయింది. అకడమిక్ బ్లాక్‌లు, వర్క్‌షాప్‌లు,సెమినార్ హాల్స్, స్వర్ణోత్సవ శతాబ్ది పైలాన్ తదితర పనులకు ఆమోదం లభించింది. రూ.400కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 50 ఏళ్ల విద్యాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం.
– కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి


