మహబూబాబాద్: సివిల్ సప్లయీస్ లబ్ధిదారులకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఈనెల 15న పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు. స్మార్ట్ రేషన్‌కార్డు లబ్ధిదారుల గౌరవానికి ప్రతీక అని భద్రత ఉంటుందని ఆరోగ్య పథకాలు, విద్యా ఫీజు రాయితీలు ఇతర ప్రయోజనాలు ఉంటాయని పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. కానీ, సివిల్ సప్లయీస్ అధికారులు మాత్రం కార్డులు వచ్చాయని, వాటిపై పూర్తిస్థాయిలో గైడ్‌లైన్స్ రాలేదని చెబుతున్నారు. దానిని రేషన్‌షాపునకు తీసుకెళ్లాలా లేదా అనే విషయంపై లబ్ధిదారులు, డీలర్లలో సందేహాలు ఉన్నాయి.
జిల్లాలో 18 మండలాలకు గాను 558 రేషన్‌షాపులు ఉన్నాయి. 2,79,039 రేషన్ కార్డులు ఉన్నాయి. ఐరిస్, బయోమెట్రిక్, ఓటీపీల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆరు ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యను బట్టి ప్రతీ నెల బియ్యం కోటాను కేటాయిస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆహార భద్రత కార్డులు కేవలం ఆన్‌లైన్ ద్వారా జారీ చేశారు. లబ్ధిదారులకు భౌతికంగా రేషన్‌కార్డులు అందించలేమని ఉంది. అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి మన్నికై న, భద్రమైన, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గుర్తింపు పత్రం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
● అదునాతన భద్రతా లక్షణాల ద్వారా నకిలీ కార్డులు, కార్డు డూప్లికేషన్ దుర్వినియోగం నివారించడం
● క్యూఆర్ కోడ్ ద్వారా తక్షణ డిజిటల్ ధ్రువీకరణను కల్పించడం
● భౌతిక రేషన్ కార్డులను డిజిటల్ పౌరసేవలతో అనుసంధానం చేయడం
● సంక్షేమ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం
● కాగితపు రికార్డులు, కార్యాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడం లాంటి అంశాలు ఉన్నాయి
కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కలెక్టర్ స్నేహశబరీష్ కార్డులను పంపిణీ ప్రారంభించారు. కాగా, 15 రోజుల్లో మండలస్థాయి అధికారులు, ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేస్తారని కలెక్టర్ స్నేహశబరీష్ తెలిపారు.
కార్డులపై స్పష్టమైన గైడ్‌లైన్స్ రాలేదని, కార్డులు మాత్రమే వచ్చాయని సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతున్నారు. దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు అని ఉండగా.. అధికారులు మాత్రం ఆ కార్డును ఎలా ఉపయోగించాలి.. మిగిలిన కార్డులు ఎప్పుడు పంపిణీ చేయాలో అనే ఏ విషయంపై గైడ్‌లైన్స్ రాలేదని చెబుతున్నారు. తమకే స్పష్టత లేదని అంటున్నారు.
స్మార్ట్ రేషన్ కార్డులను షాపులకు తీసుకెళ్లాలా వద్దా, పాత రేషన్‌కార్డులు అవసరం లేదా ఆకార్డ మాత్రమే చాలా అనే పలు సందేహాలు ఉన్నాయి. బయోమెట్రిక్, ఐరిస్, ఓటీపీ పద్ధతిలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. కాగా, ఆ కార్డును ఎలా ఉపయోగించాలి.. పంపిణీ విధాన మారుతుందా అనే సందేహాలు డీలర్లలో ఉన్నాయి.
జిల్లాలో 558 రేషన్‌షాపులు..
ఉత్తర్వుల్లో ఉన్న అంశాలు ఇవే..
ముఖ్య ఉద్దేశం..
పంపిణీ షురూ..
గైడ్‌లైన్స్ రాలేదంటున్న అధికారులు..
అయోమయం..
మండలం కార్డులు
బయ్యారం 16,309
చిన్నగూడూరు 5,801
దంతాలపల్లి 11,167
డోర్నకల్ 17,156
గంగారం 3,844
గార్ల 12,845
గూడూరు 20,642
ఇనుగుర్తి 8,953
కేసముద్రం 19,992
గైడ్‌లైన్స్ రాలేదంటున్న
సివిల్ సప్లయీస్ అధికారులు
అయోమయంలో రేషన్ డీలర్లు
జిల్లాకు చేరిన 2,78,379 కార్డులు
దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకేనా ?
మండలం కార్డులు
కొత్తగూడ 10,042
కురవి 18,397
మానుకోట 36,964
మరిపెడ 25,060
నర్సింహులపేట 10,602
నెల్లికుదురు 16,537
పెద్దవంగర 10,216
సీరోలు 8,289
తొర్రూరు 25,563