కొత్తగూడ : జ్వరంతో చికిత్స పొందుతున్న విద్యార్థి మృతిచెందింది. ఈ సంఘటన గంగారం మండలం బావురుగొండ గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి నాగేశ్వర్‌రావు కథనం ప్రకారం.. వజ్జ లిఖిత (17) జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. లిఖిత కొత్తగూడ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రిన్సిపాల్ సుధాగౌతమిని వివరణ కోరగా లిఖిత జూలై 14న సెలవుపై ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. నెలరోజుల నుంచి పాఠశాలకు రాలేదన్నారు. లిఖిత మృతిచెందినట్లు తెలిసిందని వివరించారు.


