విరిగిన విజయ డెయిరీ పాలు | - | Sakshi
Sakshi News home page

విరిగిన విజయ డెయిరీ పాలు

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

హన్మకొండ చౌరస్తా : ‘రసాయనాలు లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలు అందించడం అభినందనీయం’ అని కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ ఈ నెల 13న హనుమకొండలోని విజయ డెయిరీని సందర్శించిన సమయంలో చెప్పిన మాటలు.. డెయిరీని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్‌ పాడి రైతులు, వినియోగదారుల నమ్మకాన్ని చూరగొని, వారికి మరింత దగ్గర కావాలని అధికారులకు సూచించారు. కానీ వరంగల్‌ యూనిట్‌ పరిధిలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు శుక్రవారం సరఫరా చేసిన పాలు మొత్తం విరిగిపోయాయి. కలెక్టర్‌ చెప్పిన మరుసటి రోజే పాలు విరగడంతో డెయిరీ అధికారుల చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది.

ఉమ్మడి జిల్లాలో రూ.3.85లక్షల నష్టం

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం ప్రభుత్వ విద్యా సంస్థలకు పాల సరఫరా చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించారు. లీటర్‌కు రూ.55 చొప్పున విజయ డెయిరీ డిస్ట్రిబ్యూటర్‌కు చెల్లిస్తుండగా, ప్రభుత్వ విద్యా సంస్థలు డిస్ట్రిబ్యూటర్లకు లీటరుకు రూ.65.50లు చెల్లిస్తున్నాయి. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల పరిధిలోని సుమారు 294 సంస్థలకు డిస్ట్రిబ్యూటర్లు విజయ పాలను సరఫరా చేస్తున్నారు. సుమారు 7వేల లీటర్ల పాలకు రూ.55 చొప్పును రూ.3,85,000ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నష్టం ఆయా జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు భరించాలా, డెయిరీ భరిస్తుందా అని తేలాల్సి ఉంది.

సుమారు 7వేల లీటర్ల్లు నేలపాలు

ప్రభుత్వ విద్యాసంస్థలకు సరఫరా

తప్పెవరిది.. నష్టం ఎవరికీ

కలెక్టర్‌ సందర్శించిన

మరుసటి రోజే ఘటన

జిల్లా విద్యా పాల సరఫరా

సంస్థలు లీటర్లలో..

వరంగల్‌ 60 1,300

హనుమకొండ 65 2,200

భూపాలపల్లి 29 650

ములుగు 28 600

మహబూబాబాద్‌ 60 1,500

జనగామ 40 1,400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement