కాజీపేట రూరల్ : కాజీపేట సబ్‌డివిజన్ పరిధిలోని డోర్నకల్–గుండ్రాతి మడుగు మధ్య నేటినుంచి (శనివారం) ఈనెల 19వ తేదీ వరకు చేపట్టే మూడో రైల్వేలైన్ ప్యాచ్ వర్క్ నిర్మాణంతో పలు రైళ్లను దారి మళ్లించి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. పలు రైళ్లకు కాజీపేట, వరంగల్‌లో తాత్కాలిక హాల్టింగ్ ఎత్తివేసినట్లు వివరించారు.
దారి మళ్లించిన రైళ్లు ఇవే..
నేటినుంచి ఈ నెల 18వ తేదీ వరకు విశాఖపట్నం–ఎల్‌టీటీ (18519) వెళ్లే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్, ఎల్‌టీటీ–విశాఖపట్నం (18520)ఎక్స్‌ప్రెస్, ఈ నెల 17, 18న ముంబాయి–భువనేశ్వర్ (11019) వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్–ముంబాయి (11020) వెళ్లే ఎక్స్‌ప్రెస్, ఈ నెల 18న మచిలిపట్నం–శ్రీషిర్డి సాయినగర్ (17208) వెళ్లే ఎక్స్‌ప్రెస్, శ్రీషిర్డి సాయినగర్–కాకినాడ (17205) వెళ్లే ఎక్స్‌ప్రెస్, ఈ నెల 18,19న చర్లపల్లి–షాలిమార్ (18046) ఈస్ట్‌కోస్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ వయా కాజీపేట జంక్షన్, వరంగల్‌కు రాకుండా వయా విజయవాడ, గుంటూరు, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు దారి మళ్లించారు. అదేవిధంగా ఈ నెల 15,17న రేణిగుంట–నిజాముద్దీన్ (00761) వయా విజయవాడ, వరంగల్ మీదుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను వయా కాచిగూడ, మల్కాజ్‌గిరి, కాజీపేట, బల్లార్షా మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
పలు రైళ్లు తాత్కాలిక రద్దు
గుంటూరు–సికింద్రాబాద్ (17201) వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 19 వరకు గుంటూరు–కాజీపేట మధ్య రద్దు, ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు భద్రాచలంరోడ్–బల్లార్షా (17033) సింగరేణి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను భద్రాచలంరోడ్–వరంగల్ మధ్య రద్దు, ఈ నెల 18 వరకు సిర్‌పూర్‌కాగజ్‌నగర్–భద్రాచలంరోడ్ (17034) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను వరంగల్–భద్రాచలంరోడ్ మధ్య రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రైల్వే బ్లాక్‌తో
పలు రైళ్ల దారి మళ్లింపు
కాజీపేట వరకే గోల్కొండ


