కమ్యూనిస్టులతోనే దేశంలో మార్పు సాధ్యం | - | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టులతోనే దేశంలో మార్పు సాధ్యం

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

మహబూబాబాద్‌ అర్బన్‌ : కమ్యూనిస్టులతోనే దేశంలో మార్పులు సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఐ జనచైతన్య ప్రచార యాత్ర ముగింపు సభకు ఎమ్మెల్యే సాంబశివరావు హాజరై మాట్లాడారు. బీజేపీ పాలనలో నీట్‌ పేపర్‌ లీక్‌ చేసి విద్యార్థుల జీవితం నాశనం చేసిందని, రామాలయం భక్తుల డబ్బులు చోరీ చేసి రాముడికి దోహ్రం చేసిందని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ పాలనలో ప్రభుత్వ సంస్థలు అస్తవ్యవస్తంగా ఉన్నాయని, 12 ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. విద్యార్థులను బొద్దింకతో పోలిస్తే ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలతో ప్రధానికి బుద్ధి చెప్పారని, అదేవిధంగా రైతులకు కూడా మోసం జరిగిందన్నారు. కేంద్రంలో కూటమి నేతలతో రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. సెప్టెంబర్‌ ఒకటిన చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథిరెడ్డి, సహాయ కార్యదర్శులు బి.అజయ్‌సారథిరెడ్డి, నల్లు సుధాకర్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్లు నర్రా సంధ్యశావణ్‌, రేషపల్లి నవీన్‌, నాయకులు పెరుగు కుమార్‌, చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి, పాండురంగచారి, వెంకన్న, సందీప్‌, శేఖర్‌, స్వామి, రవీందర్‌, వెలుగు శ్రావణ్‌, రవి, రమేశ్‌, లింగ్యనాయక్‌, మహమూద్‌, ప్రవీణ్‌, శంకర్‌, పాల్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement