పీఏసీఎస్‌ల ద్వారా విత్తనోత్పత్తి | - | Sakshi
Sakshi News home page

పీఏసీఎస్‌ల ద్వారా విత్తనోత్పత్తి

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

హన్మకొండ : ప్రాథమిక సహకార సంఘాల ద్వారా విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ విశ్వవిద్యాలయం సీడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.నగేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, నాబార్డ్‌ సహకారంతో బ్రీడర్‌ విత్తనాలను పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందించి, నాణ్యమైన విత్తనాలను రైతుస్థాయిలో పండించి తిరిగి వారికే విక్రయించే విధానంపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా పీఏసీఎస్‌ చైర్మన్లు, కార్యదర్శులతో చర్చా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగేశ్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. నాబార్డ్‌ సహకారంతో ప్రతి పీఏసీఎస్‌కు తొలిదశలో ఐదెకరాల చొప్పున విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. వరంగల్‌ డీసీసీబీ సీఈఓ వజీర్‌ సుల్తాన్‌ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టడం ద్వారా రైతులకు అధిక లాభం చేకూరుతుందన్నారు. వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహ సంచాలకుడు డాక్టర్‌ ఎం.శ్రీధర్‌, నాబార్డు డీడీఎం చంద్రశేఖర్‌, వరంగల్‌ జిల్లా సహకార అధికారి నీరజ, శాస్త్రవేత్తలు డాక్టర్‌ విద్యాధర్‌, దిలీప్‌, నర్సయ్య, రమ్య, రాజ్‌కుమార్‌, విశ్వతేజ, మదన్‌మోహన్‌, శివచరణ్‌, అధికారులు పాల్గొన్నారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం

సీడ్‌ డైరెక్టర్‌ నగేష్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement